కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ గౌరవం?

Chakravarthi Kalyan
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశానికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం వచ్చింది. అక్టోబర్ 4న స్విడ్జర్లాండ్ రాజధాని జ్యూరీక్ లో జరిగే సమావేశానికి హాజరుకావాలని ఆయనకు ఆహ్వానం వచ్చింది. ఈ మేరకు ఆసియా లీడర్స్ సిరీస్ ఫోరం కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. మీలాంటి గౌరవనీయమైన, ప్రభావవంతమైన వ్యక్తుల మధ్య అర్థవంతమైన, ఆలోచనాత్మకమైన చర్చను నిర్వహించడమే మా లక్ష్యం అని కేటీఆర్‌కు పంపిన లేఖలో ఆసియా లీడర్స్ సిరీస్ వ్యవస్థాపకుడు కల్లమ్ ఫ్లెచర్ రాశారు.

ఈ సమావేశంలో ఆసియా-యూరప్ ఖండాల్లోని పలు దేశాల్లో పెరుగుతున్న రాజకీయ అనిశ్చితుల ప్రభావంపై చర్చిస్తారు. దీంతో  దెబ్బతింటున్న ప్రముఖ కంపెనీల వ్యాపార అవకాశాలపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ఆసియా, యూరప్ దేశాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు హాజరవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KTR

సంబంధిత వార్తలు: