ఆ దేశాన్ని క్రమంగా కబళిస్తున్న కార్చిచ్చు?
స్పెయిన్లో రెచ్చిపోతున్న కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు ఆ దేశ అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్త్తోంది. స్పెయిన్ ఎమర్జెన్సీ యూనిట్ సిబ్బంది అగ్నికీలల్ని అదుపులోకి తెచ్చేందుకు స్థానిక సిబ్బందికి కూడా సాయం చేస్తున్నారు. స్పెయిన్లోని మరో రెండు ప్రావిన్సుల్లో కూడా కార్చిచ్చు ప్రభావం కొనసాగుతోంది. ఇలాంటి కార్చిచ్చు వల్ల ఈ ఏడాది దాదాపు 2.5లక్షల హెక్టార్ల అడవి అగ్నికి ఆహుతైందని యూరోపియన్ ఫారెస్ట్ ఫైర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ చెబుతోంది.