ఇవాళ.. ఆ రెండు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన?

Chakravarthi Kalyan
ఇవాళ ఏపీ సీఎం జగన్  అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న ఏపీ సీఎం జగన్.. ఉదయం10.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. ఉదయం 10.40 గంటలకు ఏపీ సీఎం జగన్  అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీ సెజ్‌ కు చేరుకుంటారు. ఏపీ సెజ్ లో ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యూనిట్, ఉత్పత్తులను ఏపీ సీఎం జగన్ ప్రారంభిస్తారు.
అక్కడే మరి కొన్ని పరిశ్రమలకు ఏపీ సీఎం జగన్  భూమిపూజ కార్యక్రమం చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.40 గంటకు అక్కడి నుంచి విశాఖపట్నం బయలుదేరతారు. మధ్యాహ్నం 1.10 గంటలకు మర్రిపాలెం చేరుకోనున్న ఏపీ సీఎం జగన్.. ఇటీవలే వివాహమైన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ కుమారుడు సూర్య దంపతులను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం 1.40 గంటలకు విశాఖ నుంచి ఏపీ సీఎం జగన్ తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 3.00 గంటలకు ఏపీ సీఎం జగన్  తాడేపల్లి చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: