అప్పటి నుంచే సీఎంల జెండా వందనం..? ఆయన వల్లే?

Chakravarthi Kalyan
ఆగస్టు 15 నాడు ఢిల్లీలో ప్రధాని, రాష్ట్రాల్లో సీఎంలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించటం ఏటా చూస్తున్న విషయమే. కానీ.. పంద్రాగస్టు నాడు పీఎం జెండా ఎగరేయడం 1947 నుంచి ఉన్నా.. సీఎంలకు మాత్రం ఆ అవకాశం మొదటి నుంచి లేదు.. అప్పట్లో.. స్వాతంత్ర్య దినోత్సవం రోజు కేవలం ప్రధాని మాత్రమే జెండా ఎగరేసేవారు.
మరి సీఎంలకు ఆ అవకాశం ఎప్పటి నుంచి దక్కింది.. ఎలా దక్కింది అంటారా.. ఈ అవకాశం తమిళనాడు  సీఎం కరుణానిధి కారణంగా వచ్చింది. 1973 వరకూ దిల్లీలో ప్రధాని, రాష్ట్రాల్లో గవర్నర్లు మాత్రమే త్రివర్ణ పతాకం ఎగరేసేవారు. 1969లో అప్పటి తమిళనాడు సీఎం కరుణానిధి ఈ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాలపై వివక్ష తగదంటూ కేంద్రానికి ఘాటుగా లేఖ రాశారు. రాష్ట్రాల్లో సీఎంకు పతాకావిష్కరణ అవకాశం ఇవ్వాలన్నారు. ఆ తర్వాత ఈ డిమాండ్‌ను  ప్రధాని ఇందిరాగాంధీ అంగీకరించింది. 1974 ఆగస్టు 15 నుంచి... సీఎంలు కూడా త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించటం ప్రారంభించారు. జనవరి 26న గవర్నర్లు జెండా ఎగురవేసే విధానం వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: