హవ్వ.. రేప్‌ చేసినా.. రేపే రమ్మంటారా?

Chakravarthi Kalyan
గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వివాదంపై టీడీపీ ఓ రేంజ్‌లో విరుచుకుపడుతోంది. అయితే.. ఈ ఇష్యూపై చాలా రోజుల తర్వాత హోంమంత్రి స్పందిస్తూ.. గోరంట్ల మాధవ్‌ను వెనకేసుకొచ్చినట్టు మాట్లాడటం టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఎంపీ మాధవ్ ను వెనకేసుకు రావడానికి హోం మంత్రికి సిగ్గు లేదా అంటూ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. రాజకీయ కుట్ర అని హోం మంత్రి ఎలా చెబుతారన్న  వంగలపూడి అనిత.. వెకిలి వేషాలేస్తోన్న ఎంపీపై చర్యలు తీసుకోకుండా ఎంపీని వెనకేసుకు రావడానికి హోం మంత్రికి సిగ్గు లేదా అంటూ రెచ్చిపోయారు.
హోం మంత్రిగా ఎలా పని చేయాలో తెలియకుంటే ఇంట్లో కూర్చొవాలన్న  వంగలపూడి అనిత.. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత హోం మంత్రి బయటకొచ్చి కుట్ర అని మాట్లాడతారా అని ప్రశ్నించారు. రేప్ చేసినా రేపు రండి అనే పరిస్థితి ఏపీ పోలీస్ శాఖలో కన్పిస్తోందని.. మహిళా జేఏసీ తరపున మాధవ్ నగ్న వీడియో విషయమై ఎంపీలకు.. జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని వంగలపూడి అనిత  అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: