చంద్రబాబుకు తీవ్ర ఒళ్లునొప్పులు, నడుంనొప్పి?

Chakravarthi Kalyan

టీడీపీ అధినేత చంద్రబాబుకు తీవ్ర ఒళ్లు నొప్పులు వచ్చాయి. ఆయన తీవ్రమైన నడుం నొప్పితోనూ బాధపడుతున్నారు. అయితే.. ఇదేదో అనారోగ్యం కారణంగా వచ్చిన నొప్పులు కావు. ఆయన ఇటీవల గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఏపీలో దెబ్బతిన్న రహదారుల పై తిరిగి తనకు ఒళ్ళు నొప్పులు వచ్చాయని చంద్రబాబు చెబుతున్నారు. నడుం నొప్పి కూడా తీవ్రంగా  బాధిస్తోందని బాధితులతో చంద్రబాబు చెప్పారు.

ఒళ్లు నొప్పులు, నడుం నొప్పి బాధిస్తున్నా మీ కష్టాలు పంచుకునేందుకే నిర్విరామంగా తిరుగుతున్నానని చంద్రబాబు బాధితులతో అంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వీఆర్ పురం మండలంలోని వివిధ గ్రామాల్లో వరద ముంపు బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు.. వారితో తన ఆరోగ్యం గురించి ప్రస్తావించారు. అదే సమయంలో జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేసారు. కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ రెడ్డి, తన కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. వరద సమయంలో బాగా పనిచేసిన కొందరు పోలీసుల్ని అభినందిస్తున్నానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: