వైసీపీ నేతలు అప్పుడే పక్క చూపులు చూస్తున్నారా?

Chakravarthi Kalyan
రాజకీయాల్లో వ్యూహాలు ప్రతివ్యూహాలు జోరుగా సాగుతుంటాయి. ఎదుటి పక్షంపై పై చేయి సాధించేందుకు అప్పుడప్పుడు మాటల యుద్ధాలు కూడా సాగుతుంటాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. వైసీపీ పై మండిపడుతున్న టీడీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని విమర్శిస్తున్నారు.

తాజాగా రైతుపోరు నిర్వహించిన టీడీపీ.. వైసీపీ సర్కారు  ఆక్వా రంగం, పశుసంపద, డెయిరీలు బను ఈ ప్రభుత్వం నాశనం చేస్తోందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. జగన్ రంగం తప్ప.. అన్ని రంగాలూ నాశనం అవుతున్నాయన్నారు. తెచ్చిన అప్పులన్నీ వైకాపా నేతల జేబుల్లోకి వెళ్తున్నాయన్న యనమల రామకృష్ణుడు.. వైసీపీ నేతలు ఇప్పటికే పక్కచూపులు చూస్తున్నారని సెటైర్లు వేశారు.

టీడీపీ వచ్చాక వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామన్న యనమల.. సాగు రంగంలో స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం మీద అప్పుడే వైసీపీ నేతలు పక్కచూపులు చూస్తున్నారని విమర్శించడం ద్వారా మానసికంగా బలహీనపరచాలన్న ప్రయత్నం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: