చంద్రబాబును ఆ రాజుతో పోల్చిన విజయసాయి?

Chakravarthi Kalyan
టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చరిత్రలోని ఓ రాజుతో పోల్చారు. చంద్రబాబు అభినవ పులకేశి అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. గతంలో ఓ తమిళ కమెడియన్‌ హిసించే రాజు పులకేశి అంటూ సినిమా తీసిన సంగతి తెలసిందే. దాన్ని గుర్తు చేస్తూ విజయసాయి రెడ్డి ఈ పోలిక తెచ్చినట్టున్నారు.
 
ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నవారిని తీసేసిన ఘనత చంద్రబాబుదే అన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ఉద్యోగాలు కల్పిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. కరోనా తో ఆర్థిక మాంద్యం.. ఎన్ని కష్టాలు ఎదురయినా ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఉద్యోగాలు పోతున్న పరిస్థితుల్లో కూడా ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నామని... రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. సామాజిక న్యాయం జరిగేలా దేశ అధ్యక్ష పదవికి ఎస్టీ మహిళకు మద్దతు ప్రకటించారని.. గుర్తు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. లోకేష్ విమర్శలు, వ్యాఖ్యలు అర్థరహితం.. అసలు చదువుకున్నాడా.. ఐదేళ్లు మంత్రిగా పనిచేసి కూడా అర్థం లేకుండా సవాళ్లు విసరడం అర్థ రహితం అంటూ ఆయనపైనా మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: