టీడీపీలో కుమ్ములాటలు.. చంద్రబాబు ప్లాన్ ఫలిస్తుందా?

Chakravarthi Kalyan
తెలుగు దేశం పార్టీలో కుమ్ములాటలు ముదురుతున్నాయి. సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా కొందరు నేతలు పార్టీలోనే తగవులాడుకుంటున్నారు. ఈ గొడవలు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. అందుకే ఈ టీడీపీ నేతల మధ్య విబేధాల పరిష్కారానికి చంద్రబాబు ఓ ప్లాన్‌ వేశారు.. తగువులు తీర్చేందుకు ఓ కమిటీని వేశారు. టీడీపీ నేతల విబేధాల పరిష్కారానికి పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా కమిటీని నియమించారు.
ఈ కమిటీకి క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కూడా ఇవ్వడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఈ క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా ఎవరున్నారో తెలుసా.. పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, బచ్చుల అర్జునుడు, టి.డి.జనార్ధన్, దామచర్ల సత్య ఉన్నారు. ఇలా చంద్రబాబు నియమించిన పార్టీ క్రమశిక్షణ సంఘం కమిటీ సభ్యులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  అచ్చెన్నాయుడు తొలిసారిగా నిన్న భేటీ అయ్యారు. మరి చంద్రబాబు ప్లాన్ ఫలిస్తుందా.. చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: