వావ్‌.. ఆ రోడ్‌పై వాహనం వెళ్తేనే ఛార్జింగ్‌ అయిపోద్ధి?

Chakravarthi Kalyan
ఇప్పుడు ప్రపంచం అంతా గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం బాగా పెరుగుతోంది. అయితే.. ఈ ఎలక్ట్రిక్ వాహనాలతో చార్జింగ్ సమస్యలు ఇంకా ఇబ్బంది పెడుతున్నాయి. వాహనాల చార్జింగ్‌ను సాధ్యమైనంత సులభం చేసే దిశగా అనేక దేశాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. కొత్త కొత్త విధానాలు తెస్తున్నాయి. ఇప్పటికే అనేక దేశాలు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి ప్రోత్సాహం ప్రకటిస్తున్నాయి. ఛార్జింగ్‌ స్టేషన్లను కూడా భారీ సంఖ్యలో పెంచుతున్నాయి.

ఈ దిశగా స్వీడన్‌ దేశం ఓ అద్భుతం చేసింది. వాహనాలు ప్రయాణంలోనే ఉన్నప్పుడే ఛార్జింగ్‌ అయ్యేలా ప్లాన్ చేసింది. అలాంటి రోడ్లను ప్రపంచంలో మొదటిసారిగా అందుబాటులోకి తెచ్చింది. స్వీడన్‌లోని గాట్‌ల్యాండ్‌ ద్వీపంలో ఈ రహదారులను ఏర్పాటు చేశారు. గాట్‌ల్యాండ్‌ ద్వీపంలో అతిపెద్ద పట్టణమైన విస్బీ శివార్లలో 1.6 కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్డులో వాహనం ప్రయాణం అవుతూనే చార్జింగ్ అవుతాయి. డైనమిక్ వైర్‌లెస్ పవర్ ట్రాన్స్‌ఫర్ టెక్నాలజీ ద్వారా ఈ సాంకేతిక అద్భుతం సాకారమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: