కేసీఆర్‌కు శాశ్వతంగా జైల్లో వేద్దామన్న రేవంత్‌రెడ్డి?

Chakravarthi Kalyan
అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి అక్కడ తెలంగాణవాసులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ..  నన్ను చర్లపల్లి జైలులో వేశామని అంటున్నారు. కేసీఆర్ అవినీతిని నిరూపించి శాశ్వతంగా కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేద్దాం అన్నారు. ఖమ్మం జిల్లాలో నిరుద్యోగ యువకుడు ఉద్యోగం లేదని  రైల్ కు గుద్దుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్న రేవంత్ రెడ్డి.. అలాంటి సంఘటనలు తెలంగాణలో రోజు అవుతున్నాయన్నారు.

ఇక్కడ మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్న రేవంత్ రెడ్డి.. కానీ తెలంగాణా లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మ గౌరవం, స్వయం పాలన సామాజిక న్యాయం కోసం తెలంగాణ తెచుకున్నామని.. కానీ.. ఈ బానిస బతుకు నుంచి విముక్తి కోసం కొట్లాడుదామన్నారు. కాంగ్రెస్ వెంట మీరు ఉండండి.. తల తెగి పడ్డ వెనుకడుగు వేసేది లేదు.. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ కు విముక్తి కలిగిద్దాం.. అన్నారు రేవంత్ రెడ్డి. రాబోయే ఎన్నికలలో మీరు మీ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవండి.. కేసీఆర్ నుంచి తెలంగాణ కు విముక్తి కలిగించి తెలంగాణ కు మంచి రోజులు తెచ్చే బాధ్యత నాదని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: