అయ్య బాబోయ్‌ ఇవేం రేట్లు.. పాక్‌లో గగ్గోలు?

Chakravarthi Kalyan
మన పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో ధరల విస్ఫోటనం జరుగుతోంది. నిన్న మొన్నటి వరకూ శ్రీలంకలో రేట్ల గురించి కథలు కథలుగా చెప్పుకున్నాం కదా.. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అలాగే తయారవుతుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే.. తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇటీవలే పెట్రోల్‌, డీజిల్‌ ధరలను భారీగా పాక్ ప్రభుత్వం పెంచేసింది.

ఇక ఇప్పుడు వంట నూనె, నెయ్యి రేట్లు కూడా పాక్‌లో అమాంతం పెరిగిపోయాయి. లీటర్‌ వంట నూనెపై 208రూపాయలు, కేజీ నెయ్యిపై 213 రూపాయల మేర ప్రభుత్వం పెంచిందట. ఈ విషయాన్ని పాక్‌ పత్రిక డాన్‌ పేర్కొంది. ఈ పెంపుతో లీటర్‌ నూనె ధర 605లకు పెరిగింది. ఇప్పుడు పాక్‌లో కేజీ నెయ్యి 555 రూపాయలు. ఇక రిటైల్‌ మార్కెట్‌లో  కేజీ నెయ్యి ధర 540 నుంచి 560 రూపాయల మధ్య ఉంది. ఈ ధరలను పాక్‌లోని యుటిలిటీ స్టోర్స్‌ కార్పొరేషన్‌ కూడా ధ్రువీకరించినట్లు పాక్‌ పత్రిక డాన్‌ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: