సీఎం జగన్‌ ఆ నలుగురికి రాష్ట్రం రాసిచ్చారా?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ కు మొండివాడనే పేరు ఉంది. అయితే.. ఆయన నలుగురు వ్యక్తులకు మాత్రం చాలా ఫేవర్‌గా ఉంటారని టీడీపీ ఆరోపిస్తోంది. ఎంత ఫేవర్ అంటే.. ఏకంగా రాష్ట్రాన్ని ఆ నలుగురికి జగన్ ధారాధత్తం చేసేశారట. మరి అంతగా జగన్ ప్రయారిటీ ఇచ్చే వ్యక్తులు ఎవరో తెలుసా..
వారే విజయ సాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అట.. జగన్ నోరు లేని వారికి మంత్రి పదవులు ఇచ్చి రాష్ట్రాన్ని విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ధారాదత్తం చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు  విమర్శించారు. 151 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వారిలో కేవలం 10 మంది బీసీలకే మంత్రి పదవులు ఇచ్చుకుని గొప్పలు చెబుతున్నారని అచ్చెన్న విమర్శించారు. అదే టీడీపీ 103 సీట్లు గెలిస్తే వారిలో 9 మందికి మంత్రి పదవులు ఇచ్చిందని అచ్చెన్న గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: