బ్రేకింగ్‌: ఆ నలుగురికి మళ్లీ ఛాన్స్ ఇచ్చిన జగన్?

Chakravarthi Kalyan
ఏపీలో కొత్త మంత్రి వర్గం రేపు ప్రమాణం చేయబోతోంది. మొత్తం 24 మందికి మంత్రులుగా అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ సారి పాత మంత్రుల్లో కొందరికి మళ్లీ అవకాశం ఇస్తానని జగన్ ముందే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. వారు ఎవరన్న ఉత్కంఠ క్రమంగా వీడుతోంది. సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, కొడాలి నానిని మళ్లీ కొనసాగిస్తున్నట్టు సమాచారం వస్తోంది. ఈ నలుగురికి కొత్త కేబినెట్ లోనూ సీట్లు ఖాయం అయ్యాయి.
ఇక కొత్త వారిలో విడదల రజిని, కాకాణి గోవర్థన్ రెడ్డి, గుడివాడ అమర్‌నాథ్, వేణుగోపాల్ వంటి పేర్లు ఖరారైనట్టు తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ లీకులే కావడం విశేషం. అసలు జాబితాలో ఏమైనా మార్పులు ఉండొచ్చు కూడా. పాత మంత్రి వర్గంలో కొనసాగని బాలినేనికి హై బీపీ వచ్చినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: