బాబుకు బొత్స సవాల్‌: కుప్పం రద్దు చేస్తావా?

Chakravarthi Kalyan
కొత్త జిల్లాల ఏర్పాటుపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు.. మళ్లీ  అధికారంలోకి వస్తే కుప్పం ఆర్డీవో ఆఫీసును ఎత్తేస్తారా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి లో నూతన ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి బొత్స... జగన్‌ అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు కొత్త జిల్లాల్లో రాజకీయం జరిగిందని ఏవేవోమాట్లాడుతున్నారని మంత్రి బొత్స ఆరోపించారు. మరి చంద్రబాబు అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలను రద్దు చేస్తారా అన్ని ప్రశ్నించారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్డీఓ కార్యాలయాలు, కప్పంలో కార్యాలయాన్ని ఎత్తి వేయగలరా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు  అధికారంలో ఉన్నప్పుడు ఒకే వర్గానికి సంపద కట్టబెట్టారని మంత్రి బొత్స విమర్శించారు. జగన్‌మోహన్ రెడ్డి మాత్రం అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తున్నారని మంత్రి బొత్స మెచ్చుకున్నారు. మరి బొత్స సవాల్‌కు చంద్రబాబు ఏం చెబుతారో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: