అసెంబ్లీలో ఈల గోల: అందుకే వేశాం- టీడీపీ ఎమ్మెల్యే

Chakravarthi Kalyan
ఏపీ అసెంబ్లీలో ఈలపై గోల జరిగింది. చర్చ సమయంలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ఈలలు వేయడం వివాదానికి దారి తీసింది. అయితే.. ఈలలు వేయడాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు సమర్థించుకున్నారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. వైసీపీ సభ్యులు సభలో భజన చేస్తున్నారని.. సభ దృష్టి మళ్లించేందుకు సభలో విజిల్ వేశామని వివరణ ఇచ్చారు. అంతే కాదు..విజిల్ వేయడంలో తప్పు లేదని.. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమర్థించుకున్నారు.

శాసన సభలో నాటుసారా ఆధారాలు మేం బయటపెడుతుంటే సీఎం ముఖం చాటేశారన్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు... మా సభ్యుల్ని సస్పెండ్ చేశాకే సభను నడిపిస్తున్నారన్నారు. ప్రతిపక్షo మాట్లాడేందుకు ఒక్క నిమిషం కూడా అవకాశం ఇవ్వని సభ చరిత్రకెక్కిందన్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.. మార్షల్స్ సాయంతో నడుస్తున్న సభ చూస్తే మాకే సిగ్గేస్తోందన్నారు. ఎంతమంది ని సస్పెండ్ చేసినా, చిట్టచివరి సభ్యుడు కూడా కల్తీసారా పై పోరాడతారని.. ప్రజల కోసమే అన్నీ భరిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: