ఇవాళే ఏపీ బడ్జెట్‌.. ఏ పథకానికి ఎంత?

Chakravarthi Kalyan
ఇవాళ ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందు రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యి.. 2022-23 బడ్జెట్ ఆమోదానికి ఆమోదం తెలిపింది. శాసన సభలో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడితే... ఆ తర్వాత  వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి మంత్రి కన్నబాబు ప్రవేశపెడతారు. ఇక శాసనమండలిలో బడ్జెట్‌ను మంత్రి సీదిరి అప్పలరాజు ప్రవేశపెడతారు. శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్‌ ను మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రవేశపెడతారు.
ప్రధానంగా సంక్షేమంపై దృష్టి పెడుతున్న జగన్ సర్కారు బడ్జెట్ కూర్పుపై అంతటా ఆసక్తి నెలకొంది.. ఏఏ పథకాలకు ఎంత కేటాయిస్తారు.. ఏ రంగానికి ప్రాధాన్యం ఇస్తారు అన్న అంశాలపై ఆసక్తి నెలకొంది. సంక్షేమానికి తప్ప జగన్ సర్కారు అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శల నేపథ్యంలో పరిశ్రమల వంటి రంగాలకు ఎన్ని నిధులు కేటాయిస్తారో చూడాలి. అలాగే రాష్ట్రంలో రహాదారుల అభివృద్ధికి కేటాయింపులపైనా అందరి దృష్టి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: