మార్చి 3 జగన్ కేబినెట్ భేటీ..? ఎజెండా ఇదేనా?

Chakravarthi Kalyan
మార్చి 3న ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ సచివాలయంలో ఈ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. మార్చి 3 ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్ రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. కేబినెట్ సమావేశం కోసం మార్చి 2 తేదీ మద్యాహ్నానికి ప్రభుత్వ శాఖలు కేబినెట్ లో చర్చించే అంశాలపై ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. ఈ మేరకు ఏపీ సీఎస్ కార్యాలయం ప్రభుత్వ శాఖలను కోరింది.

ఈ సమావేశంలో అజెండా అంశాలతో పాటు పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. సినిమా టికెట్ల జీవో అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల సినిమా పెద్దలు సీఎం జగన్‌ను కలిసిన సందర్భంగా వివాదానికి శుభం కార్డు పడిందని చెప్పారు. నెలాఖరుకు జీవో వస్తుందన్నారు. కానీ ఇప్పటి వరకూ రాలేదు. దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: