హన్మకొండలో దొంగ‌ల బీభ‌త్సం

N ANJANEYULU
దొంగ‌ల‌ను అరికట్ట‌డానికి ఓ వైపు పోలీసులు చ‌ర్య‌లు చేప‌డుతూనే మ‌రోవైపు ప్ర‌ధాన న‌గ‌రాలలో, కాల‌నీల‌లో సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయినా దొంగ‌లు మాత్రం ఇవేవి లెక్క చేయ‌కుండా త‌మ ప‌ని తాము చేసుకుంటూ పోతున్నారు దొంగ‌లు. ఆ నేర‌గాళ్ల‌కు చిన్న ఛాన్స్ దొరికినా స‌రే రెచ్చిపోతున్నారు. ఆద‌మ‌రిచి ఉంటే మాత్రం త‌మ సొమ్ముకు గ్యారెంటీ లేకుండా పోతున్న‌ది. చిన్న అజాగ్ర‌త్త వ‌హించిన‌చో  భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు.
ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి హ‌న్మ‌కొండ జిల్లా కేంద్రంలో ఉన్న‌టువంటి న‌క్క‌ల‌గుట్ట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వ‌ద్ద భారీ చోరి చోటు చేసుకున్న‌ది. అయితే బ్యాంకులో డ్రా చేసిన కొద్ది సేప‌టికీ దుండ‌గులు చోరీకి పాల్ప‌డ్డారు.   వ్యాపారి తిరుప‌తి  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి  రూ.25ల‌క్ష‌ల‌ను   డ్రా చేసి కారులో పెట్టాడు. సంత‌కం కోసం తిరిగి బ్యాంకులోకి వెళ్లాడు. కారులోంచి బ్యాంకు లోప‌లికి వెళ్లి వ‌చ్చే స‌రికి న‌గ‌దును చోరీ చేసారు దుండ‌గులు. విశేషం ఏమిటంటే కారు అద్ధం ధ్వంసం చేసి మ‌రీ న‌గ‌దును అప‌హ‌రించుకుపోయారు.  దొంగ‌ల బీభ‌త్సంతో వ్యాపారి ల‌బోదిబోమ‌ని విల‌పిస్తున్నాడు. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో  కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల‌ను ప‌రిశీలిస్తున్నారు. తిరుప‌తిని గ‌మ‌నించిన వారే ఈ డ‌బ్బు మాయం చేసి ఉంటార‌ని భావిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: