విజయనగరం లో భారీ అగ్నిప్రమాదం ..మంటల్లో 30 ఇల్లు ..పేలుతున్న సిలిండర్లు ??

Surya

ఆంధ్రప్రదేశ్ లోని  విజయనగరం జిల్లాలో  శుక్రవారం సాయంకాలం భారీ అగ్నిప్రమాదం సంభవించింది . మెంటాడ మండలం  బక్కువ లోని కూరకుల వీధిలో భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపుగా 30 ఇళ్లకుపైగా అగ్నికి ఆహుతి అయ్యాయి. కోట సోలినాయుడు అనే గ్రామస్తుడి ఇంటి లో గ్యాస్ సిలిండర్ లీకు అవ్వడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ మంటల కారణంగా పక్క ఇళ్ల లోని సిలిండర్లు కూడా వెంటవెంటనే నిప్పంటుకుని మంటలు చెలరేగాయి.


కూరాకుల వీధిలోని జనాలు హాహాకారాలు చేస్తూ వీధినుండి దూరం గా పారిపోయారు. మంటలు ఇంకా ఎగసిపడుతూనే ఉన్నాయ్. సిలండర్లు పెద్ద శబ్దాలతో పేలుతున్నాయి. పరిస్థితి విషమంగానే ఉంది. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం లో నష్టం విలువ భారీగానే ఉండవచ్చని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు.  పూర్తి వివరాల కోసం ఇండియన్ హెరాల్డ్ న్యూస్ ని ఫాలో అవ్వండి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: