హాస్పిటల్ నుండి మాజీ ప్రధాని మన్మోహన్‌ డిశ్చార్జి !!

Surya
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం ఎయిమ్స్ హాస్పిటల్ నుండి డీఛార్జి చేశారు. ప్రస్తుతం అయన ఆరోగ్యం కుదుటున పాడడం తో ఎయిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం మన్మోహన్ సింగ్ ని డీఛార్జి చేశారు. అక్టోబర్ 13 న మన్మోహన్ శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది , స్వల్పంగా జ్వరం మరియు అస్వస్థత కారణంగా ఆయన్ను ఎయిమ్స్ లో చేర్చారు. వైద్యం కోసం హాస్పిటల్లో చేరిన తరువాత మన్మోహన్ కు డెంగ్యూ లక్షణాలు కనిపించడంతో రక్తపరీక్షలు చేసి వ్యాధి ని నిర్ధారించి చికిత్స అందించారు. నేటివరకు ఆయనకు మెరుగైన వైద్యం అందించారు .


 ప్రస్తుతం అయన అనారోగ్యం నుండి కోలుకోవడంతో ఆయన్ను డీఛార్జి చేశారు. మన్మోహన్ సింగ్  ఏప్రిల్ 19 న కరోనా భారీన పడ్డారు అప్పుడు కూడా ఎయిమ్స్ లో చేర్చారు. స్వల్ప జ్వర లక్షణాలు కనపడ్డ తరువాత అది కరోనా గా వైద్యులు నిర్ధారణ చేశారు. కరోనా  వ్యాధి లక్షణాలు తగ్గిన తరువాత మార్చి 4, ఏప్రిల్ 3 న రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌లను కూడా తీసుకున్నారు. 2009 లో మన్మోహన్ ఇదే ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీ కూడా  చేయించుకున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యుడుగా మన్మోహన్ కొనసాగుతున్నారు. అయితే మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా 2004  నుండి 2014  సేవలందించారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: