పూలతో నీళ్లను వేడి చేసుకోవచ్చు... ఎలాగో తెలుసా ?

Surya
 ఎక్కడైనా వాటర్ హీటర్ లతోనో  లేదా గీజర్ తోను నీటిని వేడి చేసుకుంటారు కానీ పూలతో ఎలా వేడి చేసుకుంటారు అని అనుకుంటున్నారా మీరు విన్నది నిజమేనండి. ఫ్లవర్స్ నీటిలో వేస్తే కచ్చితంగా నీరు వేడి అవుతాయి. ఎలాగంటే ఈ పూలు సోలార్ ప్యానల్ తో నిర్మితమయ్యాయి. సూర్యకాంతి  పూలపై పడినప్పుడు పూల నుండి వేడి ఉత్పన్న మవుతుంది. ఈ ఫ్లవర్స్ ని ఎక్కువగా స్విమ్మింగ్ పూల్స్ లో సూర్యరశ్మికి అనుగుణంగా వేస్తారు. అయితే ఈ ఫ్లవర్స్ స్విమ్మింగ్ పూల్ ని అందంగా చూపించడంతో పాటు నీటిని వేడి చేస్తాయి.


 అయితే ఈ ఫ్లవర్స్ వల్ల ఎటువంటి అపాయం జరగదని తయారీదారులు చెబుతున్నారు. ఈ ఫ్లవర్స్ ప్రధానంగా 3 రంగుల్లో ఉన్నాయి. నలుపు, నీలం మరియు ఇంద్రధనస్సు వర్ణాలతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. ఒక్కొక్క పువ్వు 23 సెం.మీ వ్యాసార్థం తో తయారు చేయబడ్డాయి. ఇవి చూడటానికి తేలికగా, ప్రభావ నిరోధకంగా మరియు తిరిగి వినియోగించుకునే విధంగా తయారు చేయబడ్డాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: