టీడీపీ మాజీ ఎంపీ ఇంట్లో తీవ్ర విషాదం

Chaganti
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు గారి సతీమణి యడ్లపాటి అలివేలు మంగమ్మ ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్లోని తమ స్వగృహంలో కన్ను మూశారు. ఆమె వయసు 93 సంవత్సరాలు. నిజానికి వీరు కుమారుడు యడ్లపాటి జయరాం కూడా ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే మరణించారు. జయరాం న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేయగా తెనాలిలో ఆయన అనేక సంవత్సరాల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఇక అలివేలు మంగమ్మ మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసిందని తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా పేర్కొన్నారు. ' వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ,వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం,సానుభూతి తెలియజేస్తున్నాను' అని రాజా పేర్కొన్నారు. ఇక పలువురు టీడీపీ నేతలు కూడా ఆమె మృతికి సంతాపం తెలిపారు. మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఆమె మృతికి సంతాపం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: