మోడీపై రాహుల్‌గాంధీ సెటైర్లు!!

Garikapati Rajesh

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండంకెల జీడీపీ అంటున్న మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ విరుచుకుప‌డ్డారు. భార‌తీయ జ‌న‌తాపార్టీ చెప్పినట్లుగానే జీడీపీ పెరిగిందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడారు. గ్యాస్, డీజీల్, పెట్రల్‌లను జీడీపీ అనే అర్థంలో రాహుల్‌గాంధీ చెప్పారు. న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం కొత్త నిర్వ‌చ‌నం జీడీపీకి ఇచ్చింద‌ని, ఆ నిర్వ‌చ‌నం ప్ర‌కారం జీడీపీ భారీగా పెరిగింద‌ని, జీడీపీ అంటే గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్ అన్నారు. దేశం భారీ వ్య‌యాన్ని భ‌రించాల్సి వ‌స్తోంద‌ని, ప్ర‌జల‌ను బ‌ల‌వంతంగా ప‌స్తులుంచుతున్నార‌ని, వారిని ఖాళీక‌డుపుల‌తో నిద్ర‌పోయేలా చేస్తున్న వ్య‌క్తి హాయిగా త‌న మిత్రుల నీడ‌లో విశ్రాంతి తీసుకుంటున్నార‌న్నారు. ప‌రోక్షంగా ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. పెట్రోల్‌, డీజిల్‌తోపాటు గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర కూడా పెరుగుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా 25రూపాయ‌లు పెరిగిన సిలిండ‌ర్‌వ‌ల్ల మ‌హిళ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: