భారీ బాంబు పేలుడు... 10 మంది మృతి !

Chaganti
సోమాలియా రాజధాని లో తాజాగా ఓ భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ పేలుడులో దాదాపు తొమ్మిది మంది మరణించారని, ఎనిమిది మంది గాయపడ్డారని అక్కడి హెల్త్ ఆఫీసర్ శనివారం మీడియాకు వెల్లడించారు. సోమాలియా పోలీసు ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ మొగడిషు పోలీస్ కమిషనర్ కర్నూల్ ఫర్హాన్ మహమూద్ కరోలెహ్ ను లక్ష్యం చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారని, కానీ ఆయన ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని ప్రకటించారు.

 
అల్ షాబాబ్ అనే ఉగ్రవాద సంస్థ ఈ పన్నాగం పన్నిందని నిర్ధారించారు. భారీ పేలుడు పదార్థాలతో ఆత్మాహుతి కారు బాంబు నేరుగా మొగడిషు పోలీస్ కమిషనర్ ను లక్ష్యంగా చేసుకుని ఆయన వాహనాన్ని ఢీ కొట్టారని పేర్కొన్నారు. ఈ నగరంలో నెల రోజుల వ్యవధిలో ఇంత పెద్ద భారీ పేలుడు సంభవించడం ఇది రెండవ సారి. గత వారమే టీ షాపు లక్ష్యంగా చేసుకొని జరిపిన పేలుడులో పది మంది మరణించారు. గత నెలలో మొగడిషులోని సైనిక స్థావరం వద్ద కూడా ఒక ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. అందులో 15 మంది మరణించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: