కొత్తగా 24 మంది మంత్రులు?

Chaganti

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతోందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఈ కేంద్ర కేబినెట్ లో బెర్త్ లు కన్ఫర్మ్ అయినట్టు గా ప్రచారం జరుగుతున్న దాదాపు అందరూ రాజధాని చేరుకున్నారు. ఈసారి 24 మంది కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నట్లు గా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అలాగే కొత్తగా సహకార మంత్రిత్వశాఖను కూడా మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.  జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్), సర్బానంద సోనోవాల్ (అస్సాం), నారాయణ రాణే (మహారాష్ట్ర), అనుప్రియా పటేల్ ( ఉత్తర ప్రదేశ్ ), పంకజ్ చౌధురి ( ఉత్తర ప్రదేశ్), రీటా బహుగుణ జోషి (ఉత్తర ప్రదేశ్), రామ శంకర్ కథేరియా ( ఉత్తర్ ప్రదేశ్), వరుణ్ గాంధీ ( ఉత్తర ప్రదేశ్), పశుపతి పారస్ (బీహార్), ఆర్.సి.పి. సింగ్ (బీహార్), లల్లన్ సింగ్ ( బీహార్), రాహుల్ కశ్వన్, ( రాజస్థాన్), చంద్ర ప్రకాష్ జోషి ( రాజస్థాన్), వైజయంత్ పాండా ( ఒరిస్సా), కైలాస్ విజయవర్గీయ ( మధ్యప్రదేశ్) లాంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: