నేడు లద్ధాక్ కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి.. !

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈరోజు లద్దాక్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన లద్ధాక్ లోని భద్రతా పరిస్థితులను గురించి తెలుసుకోనున్నారు. పర్యటనలో భాగంగా ఈ ప్రాంతంలోని రక్షణ దళాలకు కనెక్టివిటీని పెంచేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిర్మించిన రోడ్లను రామ్ నాథ్ కోవింద్ ప్రారంభిస్తారు. ఇదిలా ఉండగా భారత్-చైనా మధ్య శుక్రవారం వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సర్వేషన్ అండ్ కోఆర్డినేషన్ ఇండియా చైనా బోర్డర్ యొక్క 22 సమావేశంలో తూర్పు లడక్ ప్రాంతంలో సమస్యలను పరిష్కరించుకోవాలని అంగీకరించాయి.

మరోవైపు భారత్ లోని తన ప్రాంతాన్ని ఆక్రమించుకున్నట్టు చైనా ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. వాస్తవాధీన రేఖ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతకు కారణం భారత్ దూకుడు విధానాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అప్పట్లో వెల్లడించింది. మరోవైపు 2020 నుండి భారత్ చైనా మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి జూన్ నెలలో భారత్-చైనా మధ్య ఘర్షణ జరగగా భారత సైనికులు 20 మంది మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: