నామా కేసులో విచారణకు వెళ్ళింది ఎవరు...?

రాంచీ ఏక్స్ప్రెస్ ప్రాజెక్టు కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. ఈడీ కార్యాలయంకు నామా కంపెనీ డైరెక్టర్లు నేడు హాజరు కాగా వారికి కీలక ప్రశ్నలు సంధించారు అధికారులు. డైరెక్టర్లు శ్రీనివాస్ రావు, సీతయ్య, పృద్వి తేజ్ ఈడీ విచారణకు హాజరు అయ్యారు. రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ ప్రాజెక్ట్‌లో నిధుల మళ్లింపుపై విచారిస్తున్న ఈడీ.... 264 కోట్లు రూపాయలు నిధులు పక్క దారి పట్టించునట్టు కంపెనీపై అభియోగాలు మోపింది.
నిధులు దారి మల్లింపు పై 2019లో సీబీఐ కేసు కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ డైరెక్టర్లు  శ్రీనివాస్ రావ్, సీతయ్య, పృధ్వీ తేజ్ ల పేర్లను ఎఫ్ ఐ ఆర్ లో సిబిఐ అధికారులు చేర్చారు. నామా నాగేశ్వరరావు నేడు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేయగా ఆయన కూడా విచారణకు హాజరు అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: