వ్యాక్సిన్ తీసుకుంటే వరాల జల్లు ..!

KISHORE
 ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తుంది. దీంతో ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆయా దేశాలు వినూత్న రీతిలో చర్యలు చేపడుతున్నాయి. కోవిడ్ వేగానికి అడ్డుకట్ట వేయడానికి వ్యాక్సిన్ వాడకం ప్రముఖ పాత్ర వహిస్తున్నప్పటికి ప్రజలు మాత్రం టీకా వేయించుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారు.

దీంతో ప్రజల్లో టీకాపై ఆసక్తి పెంచేందుకు సెర్బియా దేశం వినూత్న పద్దతిని ప్రవేశ పెట్టింది. టీకా తీసుకున్న వారికి అదిరిపోయే షాపింగ్ కూపన్స్ అందిస్తుంది. అయితే ఇది కేవలం టీకా వేయించుకున్న మొదటి వంద మందికి మాత్రమే వర్తిస్తుందని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ పద్దతి పై ప్రజల్లో సానుకూల స్పందన వస్తుందని, ప్రజలు టీకా వేయించుకునేందుకు ముందుకు వస్తున్నారని సెర్బియా ప్రభుత్వం తెలిపింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: