తెలంగాణలో లాక్ డౌన్ లేదు..ప్రభుత్వం వెల్లడి..!!

KISHORE
 దేశ వ్యాప్తంగా కరోనా సెంకండ్ వేవ్ ప్రభావం పెరుగుతుంది. ఇప్పటికే మహారాష్ట్ర, డిల్లీ, మద్య ప్రదేశ్ వంటి ఒడిశా, కేరళ, తమిళనాడు, వంటి రాష్ట్రాలలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కేంద్రం కూడా వ్యాక్సిన్ ల పంపిణీ పెంచలంటూ కొత్త మార్గ దర్శకాలను సూచింది. ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా కూడా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా కేసుల సంఖ్య పెరగడంతో లాక్ డౌన్ అమలు దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అని వార్తలు వచ్చాయి.
 తాజాగా ఈ వార్తలపై తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఓల్డ్ సిటీ లోని మిర్చౌక్ ప్రాంతంలో భరోసా కేంద్రానికి పునాది వేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ , వీకెండ్ లాక్ డౌన్ లు విధించే ప్రణాళికలు ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. లాక్ డౌన్ అనేది ప్రజల జీవితలపై ప్రభావం చూపుతుందని అందుకే కర్ఫ్యూ విధించే ఆలోచన లేదని ఆయన తెలిపారు. పాఠశాలల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని పని చెయ్యనివ్వలా..లేదా..అనే దానిపై ప్రభుత్వం మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.  .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: