దిమ్మతిరిగే స్ట్రాటజీ తో షర్మిల.. గ్రౌండ్ వర్క్ గట్టిగానే చేశారే!!

VUYYURU SUBHASH
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలిటికల్ హీట్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ వైపు ఏపీలో పంచాయతీ ఎన్నికలు, మరో వైపు ఏపి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణ పోలిటికల్ ఎంట్రీ తో హాట్ హాట్ గా ఉన్నాయి.
వైఎస్ షర్మిల.. గత పది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతున్న పేరు. కొన్ని రోజుల ముందు తెలంగాణాలో రాజన్న రాజ్యం తీసుకువస్తా అని చెప్పి అందరికి షాక్ ఇచ్చిన షర్మిల.. రీసెంట్ గా అందరికి మరో షాకిచ్చింది. తెలంగాణలో పార్టీని ప్రారంభించేందుకు రెడీ అవుతున్న వైఎస్ షర్మిల సలహాదారులను నియమించుకున్నారు. షర్మిల పార్టీకి సలహాదారులుగా మాజీ ఐఏఎస్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఐపీఎస్‌ ఉదయ సిన్హాలు  నియామితులయ్యారు. వీరిద్దరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంవో లో పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉదయసిన్హా సీఎస్‌వోగా పనిచేస్తే.. సీఎంవోలో అడిషనల్‌ సెక్రటరీగా ప్రభాకర్‌రెడ్డి పనిచేశారు. వైఎస్ కు సన్నిహితంగా ఉన్న వారినే సలహాదారులుగా నియమించుకోవడంతో షర్మిల తదుపరి కార్యాచరణ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. దీంతో షర్మిల తన పార్టీ ఏర్పాటుకు ముందే గ్రౌండ్ వర్క్ గట్టిగానే చేసుకున్నట్లు కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: