కేంద్రానికి జగన్ లేఖ... ఏమనంటే ?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో ఆన్లైన్ గాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్ లను బ్లాక్ చేయాలని కోరుతూ జగన్ ఈ లేఖ రాశారు. కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు జగన్ ఈ లేఖ రాశారు. ఏపీలో మొత్తం 132 వెబ్ సైట్లు ఆన్లైన్ గాంబ్లింగ్, బెట్టింగ్ కు కారణం అవుతున్నాయని లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు. ఆర్థికంగా నష్టపోయిన యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక ఇప్పటికే ఆన్‌ లైన్, ఆఫ్‌ లైన్‌ రమ్మీ, పోకల్‌ వంటి జూదం, బెట్టింగ్‌లను నిషేధిస్తూ ఏపీ గేమింగ్‌ యాక్ట్‌–1974కు చేసిన సవరణలను తాజగా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ ఆటలు ఆడే వాళ్లకు ఆరు నెలల జైలు శిక్ష, నిర్వాహకులకు ఏడాది జైలు శిక్ష, జరిమానా.. రెండోసారి ఈ తప్పిదానికి పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష, జరిమానా విధించాలని నిర్ణయించింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: