2+2 చర్చల మొదలు.. అందరికి లాభమే..!

Lokesh
భారత్‌-అమెరికాల మధ్య అత్యంత కీలకమైన 2+2 చర్చలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ వేదికగా రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల కోసం అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌లు భారత్​కు విచ్చేశారు. సోమవారం వారికి గౌరవ వందనంతో భారత అధికారులు స్వాగతం పలికారు.భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. ఇవాళ అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్​తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో చీఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​ జనరల్​ బిపిన్​ రావత్​, ఆర్మీ చీఫ్​ జనరల్​ మనోజ్​ ముకుండ్​ నరవణె, ఐఏఎఫ్​ చీఫ్​ ఎయిర్​ చీఫ్​ మార్షల్​ ఆర్​కేఎస్​ బదౌరియా, నేవీ చీఫ్​ అడ్మిరల్​ కరంబిర్​ సింగ్​ పాల్గొన్నారు.

రక్షణ సమాచార మార్పిడి, సైనిక సంప్రదింపులు, రక్షణోత్పత్తుల వ్యాపారంపై ప్రధానంగా చర్చించనున్నారు. అత్యంత కీలకమైన బేసిక్‌ ఎక్స్చేంజీ అండ్‌ కో-ఆపరేషన్‌ అగ్రిమెంట్‌ (బెకా)పై సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయి. రెండేళ్ల వ్యవధిలోనే భారత్-అమెరికా మధ్య మూడోసారి 2+2 చర్చలు జరుగుతున్నాయి.అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ తర్వాత భేటీ కానున్నారు. కీలకమైన ద్వైపాక్షిక అంశాలతో పాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలపై నేతలు చర్చించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: