సైన్యం కోసం సిక్కింలో మరో రహస్య రహదారి..!

Lokesh
భారత సైన్యంపై తనకు విశ్వాసం ఉన్నట్టు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ పునరుద్ఘాటించారు. దేశ భూభాగంలోని ఒక్క అంగుళం కూడా ఇతరులు ఆక్రమించుకునే అవకాశాన్ని భారత సైనికులు ఇవ్వరని ధీమా వ్యక్తం చేశారు. రెండు రోజుల బంగాల్​, సిక్కిం పర్యటనలో ఉన్న రాజ్​నాథ్​.. డార్జిలింగ్​లో ఈ వ్యాఖ్యలు చేశారు.
విజయదశమి సందర్భంగా.. డార్జిలింగ్​లోని సుక్నా యుద్ధ స్మారకం వద్ద ఆయుధ పూజ నిర్వహించారు రాజ్​నాథ్​. సైనిక ఆయుధాలకు పూజలు చేశారు. ఈ వేడుకలో సైన్యాధిపతి జనరల్​ నరవాణే పాల్గొన్నారు.ఆయుధ పూజ అనంతరం టేవర్​ అసాల్ట్​ రైఫిల్​ పని తీరును పరిశీలించారు రాజ్​నాథ్​. దాని సామర్థ్యాన్ని, విశేషాలను అడిగి తెలుసుకున్నారు.ఆ తర్వాత.. సిక్కింలో సరిహద్దు రోడ్డు సంస్థ(బీఆర్​ఓ) ఇటీవలే నిర్మించిన ఓ రహదారిని ప్రారంభించారు రాజ్​నాథ్​. సుక్నాలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ కార్యక్రమం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: