భారత్ దాటి వెళితే ఇక అంతే.. అన్నం పెట్టారు..!

Lokesh
ఉద్యోగరీత్యా సోమాలియాకు వెళ్లిన 33 భారతీయులను అక్కడి కంపెనీ నిర్భందంలో ఉంచింది. వారిని తిరిగి భారత్​కు తీసుకురావడానికి సర్వదా ప్రయత్నిస్తున్నామని కెన్యాలోని భారత హైకమిషన్​ తెలిపింది. అందుకుగాను సోమాలియా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. వీలైనంత త్వరలో వారిని భారత్​కు తీసుకుని వస్తామని ప్రకటించింది.కంపెనీ చెరలో చిక్కుకున్న 33 మందిలో 25 మంది ఉత్తర్​ప్రదేశ్​కు, ఆరుగురు బిహార్​కు, పంజాబ్​, హిమాచల్​ ప్రదేశ్​కు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అదే కంపెనీలో పని చేస్తున్న కార్మికుడు ఈ మధ్యనే భారత్​కు తిరిగి వచ్చాడు. అక్కడి వారి బాధలను వీడియోలో చిత్రీకరించి మానవ సేవా సంస్థాన్​ అనే ఎన్​జీవోకు చూపించాడు. దీంతో రాజేశ్​కుమార్​ అనే ఎన్​జీవోకు చెందిన వ్యక్తి భారత హైకమిషన్​, విదేశాంగ శాఖను మెయిల్​, ట్విట్టర్​ ద్వారా సంప్రదించారు. వారి దుస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన హైకమిషన్​ తిరిగి ఇండియాకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: