మీరు చేసే పని సరి కాదు.. ఆలోచించండి..!

Lokesh
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని రైతులకు భరోసా ఇచ్చారు రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​. కనీస మద్దతు ధర(ఎంఎస్​పీ) కొనసాగడమే కాక ఏటా పెరుగుతుందని హామీ ఇచ్చారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు విరమించాలని అభ్యర్థించారు.ఢిల్లీలోని ఇండియా గేట్​ సమీపంలో కాంగ్రెస్​ యువజన విభాగం కార్యకర్తలు ట్రాక్టర్​ను​ తగులబెట్టడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు రాజ్​నాథ్​.
వ్యవసాయ పనుల్లో పవిత్ర ఆయుధంగా భావించే ట్రాక్టర్కు నిప్పంటించి.. రైతుల్ని అవమానపరిచారు. నేనూ రైతు కుటుంబం నుంచే వచ్చాను. రైతులకు ప్రయోజనంలేని కార్యక్రమాలేవీ మోదీ ప్రభుత్వం చేపట్టదు. ఎంఎస్పీ విషయంలోనూ అంతే. భవిష్యత్తులో కనీస మద్దతు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి అని రాజ్​నాథ్​ సింగ్ అన్నారు.ఈ చట్టాలపై రైతులకు ఉండే సందేహాలను నివృతి చేస్తున్నామని తెలిపారు రాజ్​నాథ్​.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: