లాక్ డౌన్ లో హల్ చల్ చేసిన తబ్లిగీ జమాత్ సభ్యులు విడుదల..!

Lokesh
తబ్లిగీ జమాత్​లో పాల్గొని, మసీదులో దాగి ఉన్న నేరానికి మూడు నెలలు జైలు శిక్ష అనుభవించిన 17 మంది విదేశీయులను విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది ఝార్ఖండ్​​లోని రాంచీ కోర్టు. ఈ మేరకు జస్టిస్​ ఫాహీమ్​ కిర్మాణి ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా విస్తరిస్తోన్న తరుణంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు రూ. 2,200 చొప్పున జరిమానా కూడా విధించింది ధర్మాసనం.

వారంతా మలేసియా, బ్రిటన్​, నెదర్లాండ్​, జాంబియా, కరేబియన్​ దీవులకు చెందిన వారుగా అధికారులు తెలిపారు. మలేసియాకు చెందిన ఓ మహిళకు కరోనా సోకినట్లు వెల్లడించారు.లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించి ఈ ఏడాది మార్చి నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్​కు హాజరై, మసీదులో దాగున్నారని మార్చి 30న రాంచీలోని హింద్​పిటిలో వారిని అరెస్టు చేశారు పోలీసులు. కేసును విచారించిన న్యాయస్థానం మూడునెలలు శిక్షతో పాటు జరిమానా విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: