ఛీ.. ఇలాంటి నాయకులను ఎప్పుడు చూడలేదు : రాజ్​నాథ్​ సింగ్​

Lokesh
వ్యవసాయ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన క్రమంలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. బిల్లుపై చర్చ సందర్భంగా వారి ప్రవర్తనను పలువురు కేంద్ర మంత్రులు తీవ్రంగా తప్పుపట్టారు. విపక్షాల తీరు సిగ్గుచేటుగా అభివర్ణించారు. పార్లమెంటు​ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎన్నడూ చూడలేదని తెలిపారు మంత్రులు.రాజ్యసభలో చెలరేగిన గందరగోళంపై మీడియా సమావేశం నిర్వహించి ప్రతిపక్షాలపై మండిపడ్డారు కేంద్ర మంత్రులు రాజ్​నాథ్​ సింగ్​, ప్రకాశ్​ జావడేకర్​, ప్రహ్లాద్​ జోషి, పీయూష్​ గోయల్​, థావర్​ చంద్​ గెహ్లోత్​, ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ. ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రవర్తన ఊహించలేదన్నారు రాజ్​నాథ్​ సింగ్​.

ఎన్​డీఏ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్​.. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించడం, కేంద్ర మంత్రి పదవికి ఆ పార్టీ నేత హర్​సిమ్రత్​ కౌర్​ రాజీనామా చేయడంపై స్పందించారు రాజ్​నాథ్​. అలాంటి నిర్ణయాల వెనక రాజకీయ కారణాలు ఉంటాయని, దానిపై మాట్లాడదలచుకోలేదన్నారు​. అలాగే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంపై.. ఛైర్మన్​ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: