సీఎం ఓ గ్రామానికి వెళ్లడానికి 11 గంటలు నడిచి వెళ్లారు.. ఏముంది ఆ గ్రామంలో..!

Lokesh
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండూ తన సొంత నియోజకవర్గ పర్యటన సందర్భంగా సుమారు 24 కిలోమీటర్ల దూరం కాలినడక సాగించారు. తవాంగ్ జిల్లాలోని ముక్తోలో మారుమూల గ్రామ ప్రజలను కలుస్తూ సుమారు 11 గంటలు నడిచారు. తవాంగ్లో నడక ప్రారంభించిన సీఎం.. పర్వత ప్రాంతం నుంచి సుమారు 97 కిలోమీటర్లు ప్రయాణించి లుగుతాంగ్ గ్రామానికి చేరుకున్నారు.

సముద్ర మట్టానికి సుమారు 14,500 అడుగుల ఎత్తులో ఉన్న లుగుతాంగ్లో కేవలం పది ఇళ్లు ఉంటాయి. 50 మంది నివాసం ఉంటారు. ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేని ఆ గ్రామానికి సీఎం కాలినడకన వెళ్లి సమీక్షించడం విశేషం. ఖండూతో పాటు తవాంగ్ ఎమ్మెల్యే షం రింగ్ తాషి కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: