నీ చుట్టూ గొడవలు నువ్వు చెప్పేది నీతులు.. ఇండియా పై చిన్న చూపు

Lokesh
ఇరాన్‌తో ఫలప్రదమైన చర్చలు జరిగినట్లు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రష్యాలో మూడురోజుల పర్యటన ముగించుకొని  ఇరాన్ ‌పర్యటనకు వెళ్లిన రాజ్‌నాథ్‌ ఆ దేశ రక్షణమంత్రి బ్రిగేడియర్ జనరల్ అమీర్ హతమితో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ భద్రతపై చర్చించారు. రక్షణ మంత్రులు ఇద్దరూ ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గాలపై సమాలోచనలు జరిపారు.

అఫ్గానిస్థాన్‌లో శాంతి, స్థిరత్వం నెలకొల్పడంలో ఎదురవుతున్న భద్రతా సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఇద్దరు మంత్రుల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో సమావేశం జరిగినట్లు రక్షణమంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. షాంఘై సహకార మండలి ఎస్సీఓలో పర్షియన్ గల్ఫ్ పరిస్థితుల పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఒక రోజు తర్వాత రాజ్‌నాథ్ సింగ్ ఇరాన్‌లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవలి కాలంలో ఇరాన్, అమెరికా, యూఏఈ మధ్య పర్షియన్ గల్ఫ్‌లో జరిగిన వరుస సంఘటనలు ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను పురిగొల్పాయి. పర్షియన్‌ గల్ఫ్‌ దేశాలు భారత్‌కు మిత్రదేశాలగా అభివర్ణించిన రాజ్‌నాథ్ సింగ్‌... సమస్యలను స్వేహ పూర్వకంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. పరస్పర గౌరవం, సార్వభౌమాధికారం, ఒకరి అంతర్గత వ్యవహారాలలో ఇంకొకరు జోక్యం చేసుకోకుండా చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని రాజ్‌నాథ్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: