ధోనీ నువ్వు నాకెప్పుడూ టఫ్ గానే ఉన్నావ్...!

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడం చాలా మందిని షాక్ కి గురి చేసింది. ధోనీ అసలు అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఎందుకు తప్పుకున్నాడో అర్ధం కాక కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో రెండేళ్ళు ధోనీ ఆడే అవకాశం ఉంది అని భావించిన సరే ధోనీ మాత్రం అసలు క్రికెట్ నుంచి షాక్ ఇస్తూ తప్పుకున్నాడు.
ఇప్పుడు ధోనీ క్రికెట్ నుంచి తప్పుకోవడం ఆసిస్ మాజీ ఓపెనర్ షేన్ వాట్సన్ ట్విట్టర్ లో అతనితో ఉన్న జ్ఞాపకాలను నేమరవేసుకున్నాడు. అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్‌కు అభినందనలు ధోనీ అంటూ ట్యాగ్ చేసాడు. గొప్ప ఆటగాడిగా, గొప్ప నాయకులలో ఒకరిగా మీరు మైదానంలో సాధించిన దాని గురించి మీరు చాలా గర్వపడాలన్నాడు. మీకు ప్రత్యర్ధిగా ఆడటం ఎప్పుడు కష్టమే అని, కాని ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ పుణ్యమా అని కలిసి ఆడుతున్నామని అన్నారు. నిజమైన ట్రీట్ ఇది అంటూ కామెంట్ చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: