చైనాపో పోరు :  చైనా వస్తువులను కాల్చి వేస్తున్న వ్యాపారలు!

Edari Rama Krishna

గాల్వన్ లోయలో ఘర్షణల అనంతరం భారత్ లో చైనాపై వ్యతిరేకత అధికమవుతోంది. ప్రజల్లోనే కాదు ప్రభుత్వాలు కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నాయి.  ఓ వైపు కరోనాతో నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో దేశాల మద్య సమన్వయం ఉంటూ.. స్నేహ హస్తాన్ని చాపాల్సింది పోయి.. దొంగ దెబ్బ తీసి భారత సైనికులను 20 మందిని పొట్టన బెట్టుకున్నారు డ్రాగన్లు.  దాంతో దేశ వ్యాప్తంగా చైనాపై ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. చైనాకు సంబంధించిన వస్తువులు సర్వ నాశనం చేయాలని.. యాప్స్ ను బహిష్కరించాలని అంటున్నారు.  ఈ నేపథ్యంలో అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ)కి చెందిన కొందరు చైనా వస్తువులను దహనం చేశారు.

 

సోమవారం ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో సీఏఐటీ వ్యాపారులు చైనా నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువులను దహనం చేశారు. ఈ సందర్బంగా వ్యాపారులు మాట్లాడుతూ..  చైనా వస్తువుల దిగుమతిని నిలిపివేస్తామని వారు పేర్కొన్నారు. 2021 డిసెంబర్‌ నాటికి రూ. లక్ష కోట్ల విలువైన చైనా వస్తువుల దిగుమతిని తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: