కరోనా వేళ సినీ దంపతులు రక్తదానం.. ఎందుకంటే..?

Lavanya

కరోనా వైరస్‌ కోసం వాక్సిన్‌ను కనిపెట్టే ప్రయత్నాలకు హాలీవుడ్ సినీ దంపతులు టామ్ హాంక్స్, రీటా విల్సన్‌ ముందుకొస్తున్నారు. మార్చిలో ఆ స్ట్రేలియాలో సినిమా షూటింగ్ వెళ్లిన క్రమంలో వారిద్దరూ కరోనా వైరస్ వారిన పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారు ఆస్ట్రేలియాలోని ఓ రిస్టార్టులో క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకొన్నారు. ఆ తర్వాత కరోనా నెగిటివ్ అని తేలడంతో మార్చిలో అమెరికాకు చేరుకొన్నారు. యూఎస్‌లో వారు స్వీయ గృహ నిర్బంధంలో ఉంటున్నారు.

 

తాజాగా కరోనావైరస్ కోసం వ్యాక్సిన్ కనిపెట్టే సైంటిస్టులకు నైతిక బలాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనావైరస్ కోసం రక్తదానం చేసేందుకు ముందుకు రావడం విశేషం. ప్లాస్మా ద్వారా కరోనాకు చెక్ పెట్టేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో టామ్ హాంక్స్ దంపతులు రక్తాన్ని దానం చేయడానికి ముందుకు రావడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గతవారం వారిద్దరూ అమెరికాలో రక్తదాన కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించారని మీడియా కథనాలు వెలువడ్డాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: