హెరాల్డ్ బర్త్ డే : 11-05-2020 రోజున జన్మించిన ప్రముఖులు...?

praveen

మే 11వ తేదీన ఒక సారి చరిత్రలోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి ఈరోజు  జరిగిన జననాలు  ఏంటో తెలుసుకుందాం రండి. 

 

 

శ్రీజారెడ్డి స‌రిప‌ల్లి : ప్రముఖ టెకీగా గుర్తింపు పొందిన కోటిరెడ్డి స‌రిప‌ల్లి స‌తీమ‌ణి శ్రీజారెడ్డి స‌రిప‌ల్లి ఈ రోజు జ‌న్మించారు. ఉన్న‌త విద్యావంతురాలు, పోష‌కాహార నిపుణురాలు అయిత‌న శ్రీజారెడ్డి త‌న కుమారుడికి ఎదురైన అనుభ‌వంతో ఎంతో ప‌ట్టుద‌ల‌తో అటిజం స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుగొన్నారు. అచేత‌న స్థితిలో ఉన్న చిన్నారుల మాన‌సిక స్థితిని అధ్య‌య‌నం చేయ‌డం మొద‌లుకుని, వారితో యాక్టివిటీ చేయించ‌డం వ‌ర‌కు, వారిని మాన‌సికంగా దృఢంగా చేయ‌డం వ‌ర‌కు కూడా శ్రీజారెడ్డి అనేక రూపాల్లో త‌న సంస్థ‌లో సేవ‌ల‌ను విస్తృతం చేశారు. పినాకిల్ బ్లూమ్స్ నెట్ వ‌ర్క్ పేరుతో 14 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సంస్థ‌ల ద్వారా ఆటిజం చిన్నారుల‌కు సేవ‌లు సుగ‌మం చేశారు. ఈ రంగంలో వేలాది మంది పిల్ల‌ల‌కు శిక్ష‌ణ ఇచ్చి వారిని మామూలు మ‌నిషిగా చేయ‌డంలో త‌న‌దైన ముద్ర వేసుకున్నారు.

 

 

 ఆద శర్మ శర్మ : ప్రముఖ తెలుగు హీరోయిన్లలో ఒకరైన ఆద శర్మ తెలుగు చిత్ర పరిశ్రమలో పలు సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. కాగా ఆద శర్మ  1992 మే 11వ తేదీన జన్మించాడు. తెలుగుతో పాటు హిందీ భాషల్లో కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతుంది ఆద శర్మ. అంతేకాకుండా సోషల్ మీడియా వేధికగా  కూడా అభిమానులను అలరిస్తోంది. ఇక సోషల్ మీడియాలో తన హాట్ హాట్ అందాలతో ఎంతోమంది ప్రేక్షకుల మతి పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో హార్ట్ ఎటాక్ మూవీ తో తెలుగు ప్రేక్షకులందరికీ మరింత దగ్గరయ్యింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించింది ఆద శర్మ. 

 

 సుధీర్ బాబు జననం  : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరో సుధీర్ బాబు  తెలుగు ప్రేక్షకులందరికీ కొసమెరుపు. మహేష్ బాబు బావ అయినా సుధీర్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎస్ఎంఎస్ సినిమాతో హీరోగా పరిచయం. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించారు. కాగా సుధీర్ బాబు  1977 మే 11వ తేదీన జన్మించారు. కేవలం తెలుగులోనే కాదు బాలీవుడ్ కూడా ఎన్నో అవకాశాలను దక్కించుకున్నారు  సుధీర్ బాబు. ప్రొఫెషనల్ బ్యాట్మెంటన్ ప్లేయర్ గా  కూడా సుధీర్ బాబుకు మంచి గుర్తింపు ఉంది. తనలోని నటున్ని  తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం చేస్తూ ఎంతగానో గుర్తింపు సంపాదించారు సుధీర్ బాబు. 

 

 

 రాజ్ తరుణ్ : తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు రాజ్ తరుణ్. లఘు చిత్రాల ద్వారా తన సత్తా చాటి రాజ్ తరుణ్  ఆ తర్వాత వెండితెరపై కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి  వరుస అవకాశాలు దక్కించుకుంటూ సత్తా చాటుతున్నారు. కాగా  రాజ్ తరుణ్ 1992 మే 11వ తేదీన విశాఖపట్నంలో జన్మించారు. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్... ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక మొదట్లో కెరీర్ పరంగా మంచి విజయాలను అందుకున్న రాజ్ తరుణ్... ఆ తర్వాత ఎన్ని ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విషయాన్ని మాత్రం అందుకోలేక పోతున్నాడు. ప్రస్తుతం కెరీర్ లో మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు రాజ్ తరుణ్ .

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: