ఇవి తింటే తెల్ల జుట్టుకి ఈజీగా చెక్ పెట్టొచ్చు?

Purushottham Vinay
ఇక మన శరీరంలో పోషక లోపం వల్లే తెల్ల జుట్టు సమస్యలు ఛాయా ఎక్కువగా వస్తాయి. కాబట్టి అధికంగా పోషకాలున్న ఆహారాలు ప్రతి రోజూ కూడా తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు సమస్యల నుంచి చాలా సులభంగా ఉపశమనం పొందొచ్చు. అందుకోసం ప్రతి రోజు కూడా ఆహారంలో పాలు, పెరుగు ఇంకా జున్ను వంటి పాల ఉత్పత్తులను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. పాల ఉత్పత్తుల్లో విటమిన్ B12, కాల్షియం, ప్రోటీన్ ఇంకా ఇతర పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈజీగా జుట్టు సమస్యల నుంచి మీకు ఉపశమనం కలిగిస్తాయి.మన శరీరానికి తగిన పరిమాణంలో ప్రోటీన్స్‌ అందడానికి తప్పకుండా ప్రతి రోజు కూడా రెండు గుడ్లను ఆహారంలో చేర్చుకొని తీసుకోవాల్సి ఉంటుంది. జుట్టు దృఢత్వాన్ని పెంచుకోవడానికి ప్రతి రోజు కూడా ఖచ్చితంగా ఎగ్ సలాడ్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో విటమిన్ బి12 కూడా చాలా పుష్కలంగా లభిస్తుంది. ఇది చాలా సులభంగా జుట్టును నల్లగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారంలో సోయాబీన్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది.


ఎందుకంటే ఇందులో చాలా రకాల పోషకాలు లభిస్తాయి. దీంతో శరీరానికి యాంటీ-ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ పరిమాణంలో లభించి జుట్టును నల్లగా చేయడానికి సహాయపడుతుంది.ఇంకా అంతేకాకుండా అనారోగ్య సమస్యలు రాకుండా కూడా శరీరాన్ని కాపాడుతుంది.అలాగే పచ్చని ఆకు కూరల్లో కూడా విటమిన్స్ చాలా ఎక్కువగా లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరం చాలా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఈజీగా దూరమవుతాయి. ప్రతి రోజూ కూడా మనం తీసుకునే ఆహారంలో బచ్చలికూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ చేర్చుకుంటే శరీరానికి ఐరన్, విటమిన్లు, కాల్షియం, ఫోలేట్ లభిస్తాయి.అలాగే తెల్ల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పుట్టగొడుగులు కూడా చాలా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో లభించే రాగి మెలనిన్ ఉత్పత్తిని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా అంతేకాకుండా జుట్టు రాలడాన్ని కూడా చాలా సులభంగా నియంత్రిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: