ఈ టిప్స్ పాటిస్తే మొటిమలు వద్దన్నా రావు?

Purushottham Vinay
చాలా మందిని కూడా చాలా కాలం పాటు వేధించే చర్మ సమస్యల్లో మొటిమలనేవి ముందు వరుసలో ఉంటాయి.ముఖంపై ఒక మొటిమ వచ్చిందంటే చాలు చాలా ఇబ్బంది పడి పడిపోతుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు అయితే మొటిమల వల్ల ఖచ్చితంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు.మొటిమలు ఖచ్చితంగా మన అందాన్ని పాడుచేస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు.అందుకే వాటిని వదిలించుకోవడం కోసం చాలా మంది ఎన్నో రకాలుగా ముప్ప తిప్పలు పడుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ టిప్స్ పాటిస్తే మొటిమలు పోవడమే కాదు మళ్ళీ అవి మీ దరిదాపుల్లోకి రాకుండా కూడా ఉంటాయి.మరి ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.త్రిఫల పౌడర్ అనేది మన ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే చర్మ సౌందర్యానికి కూడా త్రిఫల పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

అందుకోసం ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో పావు టేబుల్ స్పూన్ త్రిఫల పౌడర్ ని ఇంకా అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి రాత్రి అంతా కూడా వదిలేయాలి. ఆ మరుసటి రోజు వాటర్ ను ఫిల్టర్ చేసుకుని తాగాలి. ప్రతిరోజు ఉదయాన్నే ఈ త్రిఫల వాటర్ ను తాగితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ చందనం పొడిని వేసుకోవాలి. ఇంకా అలాగే చిటికెడు పసుపు ఇంకా సరిపడా కొబ్బరి పాలని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పూతల అప్లై చేసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తరువాత వాటర్ తో బాగా శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి. రెండు రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఇలా చేయాలి. అంతే ఈ రెండు టిప్స్ పాటిస్తే మొటిమలు వాటి తాలూకు మచ్చలు చాలా చాలా త్వరగా తగ్గుముఖం పడతాయి. ఇంకా అలాగే మిమ్మల్ని మొటిమలు మళ్లీమళ్లీ వేధించకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: