మచ్చలు, మొటిమలు తగ్గి అందంగా ఉండాలంటే..?

Purushottham Vinay
మచ్చలు, మొటిమలు వంటి సమస్యల కారణంగా ముఖం ఖచ్చితంగా అందవిహీనంగా తయారవుతుంది. మొటిమలు, నల్ల మచ్చలు, అలాగే మొటిమల వల్ల వచ్చే మచ్చలు ఇంకా అలాగే గుంతలు మన దరి చేరకుండా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ కూడా ముఖాన్ని బాగా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ముఖంపై జిడ్డు పేరుకుపోకుండా చూసుకోవాలి. చాలా మంది కూడా తమ ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి స్క్రబర్ లను, ఫేస్ వాష్ లను వాడుతూ ఉంటారు. అందుకోసం చాలా ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక ప్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల ముఖంపై ఉండే జిడ్డును, మురికిని ఇంకా అలాగే మృతకణాలను చాలా ఈజీగా తొలగించుకోవచ్చు.మన ముఖంపై ఉండే జిడ్డును ఇంకా మచ్చలను ఈజీగా తొలగించి ముఖాన్ని అందంగా మార్చే టిప్ ని ఎలా తయారు చేసుకోవాలి ఇంకా అలాగే దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ టిప్ తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ శనగపిండిని తీసుకోని ఆ తరువాత ఇందులో మీగడ లేని పుల్లటి పెరుగును తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో చిటికెడు పసుపును కూడా వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకుని బాగా సున్నితంగా కాసేపు మర్దనా చేసుకోవాలి.ఇక అది ఆరిన తరువాత నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే జిడ్డు చాలా ఈజీగా తొలగిపోతుంది. ఇంకా అలాగే చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు, మురికి ఇంకా దుమ్ము అంతా కూడా ఈజీగా తొలగిపోయి చర్మం అందంగా తయారవుతుంది. ఇంకా అంతేకాకుండా ఈ ప్యాక్ ను వాడడం వల్ల చర్మంపై ఉండే మొటిమలు అలాగే మచ్చలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి.ఇక ఈ ప్యాక్ ను వారం రోజుల పాటు క్రమం తప్పకుండా వాడడం వల్ల ఎండ వల్ల నల్లగా మారిన చర్మం ఖచ్చితంగా తెల్లగా మారుతుంది. ఈ విధంగా ఈ టిప్ ని ఉపయోగించడం వల్ల ముఖం ఉండే మొటిమలు, మచ్చలు తొలగిపోవడంతో పాటు మరలా రాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: