నిత్యం యవ్వనంగా అందంగా ఉండాలంటే..?

Purushottham Vinay
చాలా మంది కూడా అందంగా యవ్వనంగా కనపడటానికి సబ్బు, క్రీమ్ ఇంకా అలాగే ఆయింట్‌మెంట్ అని తేడా లేకుండా అన్నీ రకాల ప్రోడక్ట్ లు వాడేస్తున్నారు. అయితే వాటితో ప్రయోజనాలు లేకపోగ చర్మ సంరక్షణకి ప్రమాదం ఉందని చర్మ సంబంధిత శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఇంకా ఇవి ముఖంపై మచ్చలు ఇంకా మొటిమలకు కూడా దారి తీసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ క్రమంలో యవ్వనంగా కనిపించేందుకు సహజ పద్ధతులనే పాటించడం చాలా మేలని సూచిస్తున్నారు. ఇక సహాజ పద్ధతులలో భాగంగా అన్నాట్టో గింజలను తీసుకోవచ్చని సాందర్య నిపుణులు వివరిస్తున్నారు.ఎందుకంటే వీటితో చర్మ, కంటి, ఆరోగ్య సమస్యలకు చాలా ఈజీగా చెక్ పెట్టేయొచ్చని అంటున్నారు. మరి ఆ సీడ్స్‌తో  ఎలాంటి ప్రయోజనాలని పొందవచ్చో  ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఈ అన్నాట్టో గింజల్లో అమైనో ఆమ్లాలు, కాల్షియం, ఇనుము, భాస్వరం ఇంకా అలాగే విటమిన్ బీ-2,3 అధికంగా ఉండటం వల్ల మనకు చాలా రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.


ఇంకా అంతేకాకుండా అన్నాట్లో గింజల్లో కెరోటిన్, విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలు ఇంకా డీఎన్ఏకు ఫ్రీ రాడికల్ కారణంగా కలిగే నష్టాలను చాలా ఈజీగా నివారిస్తాయి.అలాగే ఈ అన్నాట్టో సీడ్స్‌లో ఉండే ఫైటోకెమికల్స్ సైనిడిన్, ఎలాజిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, సపోనిన్లు, టానిన్లు ఇంకా అలాగే విటమిన్ సి వంటి లక్షణాలు మంచి వ్యాధి నిరోధక శక్తిగా పనిచేస్తాయి.ఇంకా అలాగే ఈ గింజల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మనల్ని చర్మ సమస్యలను నుంచి చాలా ఈజీగా కాపాడతాయి. ఇంకా అంతే కాకుండా పొడి చర్మం, ముడతలను తగ్గించడమే కాకుండా వృద్ధాప్యాన్ని తగ్గించి నిత్య యవ్వనంగా ఉండేలా కూడా ఇవి చేస్తాయి.అన్నాట్టో సీడ్స్ లో ఇన్ని గుణాలు ఉన్న కారణంగా వీటిని చాలా కాస్మోటిక్ ఉత్పత్తుల తయారీలో కూడా వీటిని ఉపయోగిస్తారు.ఈ అన్నాట్టో గింజలలో కెరోటినాయిడ్స్ ఉండడం వల్ల కంటిశుక్లం పెరగకుండా కూడా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: