జుట్టును బలంగా మార్చే నూనె ఇదే?

Purushottham Vinay
మన జుట్టును బలంగా మార్చే నూనెని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను తయారు చేసుకోవడానికి మనం ముందుగా ఒక గిన్నెలో 100 ఎమ్ ఎల్ కొబ్బరి నూనెను తీసుకోవాలి. ఆ తరువాత ఈ నూనెను చిన్న మంటపై కొంచెం వేడి చేయాలి. ఇక ఆ తరువాత ఇందులో 2 టీ స్పూన్ల మెంతులు వేసి వేడి చేయాలి.ఆ తరువాత రెండు రెమ్మల కరివేపాకును వేసి కొంచెం సేపు వేడి చేయాలి.ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ ఆముదం వేసి నూనెను బాగా కలపాలి. ఈ నూనెను చిన్న మంటపై అలాగే కలుపుతూ వేడి చేయాలి.మెంతులు, కరివేపాకులో ఉండే పోషకాలు నూనెలో కలిసి నూనె రంగు మారే దాకా వేడి చేసి ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నూనెను చల్లారే దాకా అలాగే ఉంచి ఆ తరువాత వడకట్టుకుని స్టోర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను మనం రెండు నెలల పాటు సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివరి దాకా బాగా పట్టించాలి.


ఈ నూనెను రాసుకున్న మరుసటి రోజూ శుభ్రంగా తలస్నానం చేయాలి. ఈ నూనెను రోజంతా జుట్టుకు ఉంచుకోవడం కుదరని వారు రాత్రి పడుకునే ముందు ఈ నూనెను రాసుకుని ఉదయాన్నే తల స్నానం చెయ్యాలి. ఇలా వారినికి రెండు సార్లు చేయడం వల్ల జట్టు రాలడం ఈజీగా తగ్గుతుంది. ఈ నూనెను ఉపయోగించడం వల్ల జుట్టుకు కావల్సిన పోషకాలన్నీ కూడా ఈజీగా అందుతాయి.జుట్టు కుదుళ్లు బలంగా ఇంకా ధృడంగా తయారవుతాయి. ఈ నూనెను ఉపయోగించడం వల్ల చుండ్రు ఇంకా దురద వంటి సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. జుట్టు రాలడం, జుట్టు బలహీనంగా మారడం, చుండ్రు ఇంకా తెల్ల జుట్టు వంటి సమస్యలతో బాధపడే వారు ఈ టిప్ ని వాడడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సులభంగా జుట్టును ఒత్తుగా, నల్లగా ఇంకా పొడవుగా కూడా మార్చుకోవచ్చు.కాబట్టి ఖచ్చితంగా ఈ నూనెని తయారు చేసుకొని ఖచ్చితంగా వాడండి. చక్కటి ఫలితాలు పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: