జుట్టు పెరుగుదలకి అదిరిపోయే చిట్కా?

Purushottham Vinay
ఈ కాలంలో చాలా మంది కూడా ఎక్కువగా జుట్టు సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. జుట్టు రాలడం ఇంకా జుట్టు బలహీనంగా మారడం వంటి వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అందుకు మారిన  ఆహారపు అలవాట్లే జుట్టు సంబంధిత సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు.ఈ రోజుల్లో చాలా మందికి కూడా జుట్టుకు తగిన పోషకాలు అందక జుట్టు చాలా ఎక్కువగా రాలుతుంది. జుట్టు బాగా దెబ్బతింటుంది. జుట్టు రాలకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా జుట్టుకు తగిన పోషకాలను అందించాలి. ఇక మన జుట్టుకు కావల్సిన పోషకాలను కలిగి ఉండే వాటిల్లో ఉల్లిపాయ ఒకటి. ఉల్లిపాయ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా పనిచేస్తుంది.అందుకే జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఉల్లిపాయతో నీటిని తయారు చేసుకుని వాడటం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఈ నీటిని తయారు చేసుకోవడానికి ముందుగా మధ్యస్థంగా ఉండే మూడు ఉల్లిపాయలను మీరు తీసుకోవాలి. తరువాత వాటిపై ఉండే పొట్టును తీసి వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి.


ఆ తరువాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోని అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి ఉల్లిపాయ ముక్కలను ఉడికించాలి.ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఆ నీటిని వడకట్టాలి.ఇక ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ నీరు తయారవుతుంది. ఈ నీరు గోరు వెచ్చగా అయిన తరువాత జుట్టుకు బాగా పట్టించాలి. అయితే ఈ ఉల్లిపాయ నీటిని జుట్టుకు పట్టించేటప్పుడు మీ జుట్టుకు నూనె లేకుండా కూడా చూసుకోవాలి.ఈ నీటిని జుట్టు కుదుళ్ల నుండి చివరి దాకా బాగా పట్టించాలి. ఆ తరువాత జుట్టు కుదుళ్లల్లోకి ఇంకేలా బాగా తలకి మర్దనా చేసుకోవాలి.తరువాత ఈ నీటిని రెండు గంటల పాటు అలాగే ఉంచి ఆ తరువాత బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది. అంతేగాక మీ జుట్టుకు కావల్సిన పోషకాలు కూడా అంది జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఈ విధంగా ఉల్లిపాయలతో నీటిని తయారు చేసుకుని వాడడం వల్ల మనం అందమైన, ఒత్తైన ఇంకా అలాగే ఆరోగ్యవంతమైన జుట్టును సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: